News April 11, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 11, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
ఇష: రాత్రి 7.45 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 18, 2025

‘మలబార్’కు పాక్ ఇన్‌ఫ్లూయెన్సర్ కష్టాలు

image

ధంతేరాస్ వేళ మలబార్ గోల్డ్&డైమండ్స్‌ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ కంపెనీ లండన్‌లో తమ షోరూమ్ ఓపెనింగ్‌కు UK బేస్డ్ పాక్ ఇన్‌ఫ్లూయెన్సర్ అలిష్బా ఖాలీద్‌తో కొలాబరేట్ కావడమే అందుక్కారణం. గతంలో ఆమె Op సిందూర్‌ను ‘పిరికి చర్య’గా అభివర్ణించారు. దీంతో మలబార్ యాజమాన్యం పాక్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తోందని నెటిజన్లు SMలో పోస్టులు పెట్టారు. సంస్థ బాంబే కోర్టుకెళ్లగా అలాంటి పోస్టులు తొలగించాలని ఆదేశించింది.

News October 18, 2025

దీపావళి దీపాలు: పాటించాల్సిన నియమాలు

image

దీపావళి రోజున దీపాలను నేరుగా నేలపై పెట్టడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. నేలపై అక్షింతలు పోసి, వాటిపై పెట్టాలని సూచిస్తున్నారు. ‘దీపంలో నూనెను పూర్తిగా నింపకూడదు. అది బయటకి వస్తే లక్ష్మీదేవికి అపకీర్తి కలిగిస్తుంది. ఆరోగ్యం కోసం తూర్పున, ధనం కోసం ఉత్తరాన దీపాలు పెట్టాలి. నేతి దీపానికి పత్తి వత్తిని, నూనె దీపానికి ఎర్ర దారం వత్తిని వాడాలి. పగిలిన ప్రమిదలను వాడొద్దు’ అని సూచిస్తున్నారు.

News October 18, 2025

పాక్‌ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే.. రాజ్‌నాథ్ వార్నింగ్

image

పాకిస్థాన్‌లోని ప్రతి ఇంచ్ తమ బ్రహ్మోస్ మిసైళ్ల రేంజ్‌లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హెచ్చరించారు. బ్రహ్మోస్ సత్తా ఏంటో ఆపరేషన్ సిందూర్‌లో తెలిసిందని అన్నారు. ‘Op Sindoor ట్రైలర్ మాత్రమే. ఆ ట్రైలర్‌తోనే మనమేంటో ప్రత్యర్థికి అర్థమైంది. పాక్‌కు జన్మనివ్వగలిగిన ఇండియా.. అవసరమైతే ఏమైనా చేయగలదని తెలియజేసింది’ అని చెప్పారు. UP లక్నోలో తయారైన తొలి విడత బ్రహ్మోస్ మిసైళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు.