News April 14, 2025
ఈరోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 14, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు
ఇష: రాత్రి 7.46 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 15, 2025
బెంగాల్‌లో హింస.. బంగ్లాదేశీయుల హ్యాండ్?

వక్ఫ్ బిల్లు సవరణను నిరసిస్తూ గత వారం పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస వెనుక బంగ్లా దుండగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్లో కలిసిపోయిన దుండగులు రాళ్లు రువ్వి హింసకు తెరతీశారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఆ అల్లర్లలో ముగ్గురు చనిపోగా, పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. కేసులో ఇప్పటి వరకు 200మందికి పైగా నిందితుల్ని అధికారులు అరెస్ట్ చేశారు.
News April 15, 2025
నా పాటలు వాడుకున్నందుకు రూ.5కోట్లు ఇవ్వాలి: ఇళయరాజా

హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నిర్మాతలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. తాను గతంలో స్వరపరిచిన 3 పాటలను వాడుకున్నారని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకు రూ.5కోట్లు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించారు. కాగా గతంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మేకర్స్‌కూ ఆయన నోటీసులిచ్చారు.
News April 15, 2025
గురుకుల విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసుకోవచ్చు!

TG: ఎస్సీ గురుకులాల్లో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఎన్నిసార్లైనా ఫ్రీగా పేరెంట్స్‌తో మాట్లాడొచ్చు. విద్యార్థులను బట్టి 7-10 ఫోన్లు అందుబాటులో ఉంటాయి. నలుగురికి ఒక కాలింగ్ కార్డిస్తారు. అందులో రిజిస్టర్ చేసిన నంబర్స్‌కే కాల్ వెళ్తుంది. హెల్ప్ సెంటర్ నంబరుకూ కాల్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. స్మార్ట్ ఫోన్ కానందున నిరుపయోగం అయ్యే ఛాన్స్ తక్కువ.