News January 6, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 6, సోమవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు ✒ ఇష: రాత్రి 7.13 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 19, 2026

ఈ సమ్మర్‌లో మిక్స్‌డ్ వెదర్

image

ఈసారి ఎండాకాలంలో మిక్స్‌డ్ వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఓ వైపు ఎండలతో పాటు వానలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2023కు మించిన ఎండలు, మేతో పాటు జూన్ ప్రారంభంలో తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు చలి ప్రభావం తగ్గుముఖం పడుతుందని తెలిపారు.

News January 19, 2026

చార్‌ధామ్ యాత్ర.. టెంపుల్స్‌లోకి మొబైల్స్ బంద్

image

చార్‌ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లోకి మొబైల్స్, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్స్, కెమెరాలు సేఫ్‌గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

News January 19, 2026

సంతానలేమిని నివారించే ఖర్జూరం

image

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.