News January 7, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 7, మంగళవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ✒ ఇష: రాత్రి 7.14 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 8, 2025
సంక్రాంతి సెలవులు.. ఎవరికి ఎన్నిరోజులంటే?
ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై కాస్త గందరగోళం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు హాలిడేస్ ఎప్పుడనే వివరాలు చూద్దాం.
* TGలో స్కూళ్లకు ఈనెల 11-17 వరకు
* జూనియర్ కాలేజీలకు 11-16 వరకు
* APలో స్కూళ్లకు ఈనెల 10-19 వరకు
* క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 11-15 వరకు
* జూనియర్ కాలేజీలకు ఇంకా సెలవులు ప్రకటించలేదు.
News January 8, 2025
రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!
AP: వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.
News January 8, 2025
ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
TG: పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ, EHS, JHS కింద రూ.1000Cr పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నాయి. దీంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితులు లేకుండాపోయాయని వెల్లడించాయి. కాగా ఏడాదిలో రూ.920Cr బిల్లులు చెల్లించామని, మరో రూ.450-500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.