News January 8, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 8, బుధవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ✒ ఇష: రాత్రి 7.14 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 8, 2025
అందుకే బీర్ల ధరలు పెంచలేదు: మంత్రి జూపల్లి
TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.
News January 8, 2025
పృథ్వీ షా కఠోర సాధన: పిక్స్ వైరల్
టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా కఠోర సాధన చేస్తున్నారు. ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు ఆయన మైదానం, జిమ్‌లోనూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ట్రాక్‌పై పరిగెత్తుతూ, జిమ్‌లో వర్కౌట్ చేస్తూ, టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పృథ్వీ SMలో పంచుకున్నారు. కాగా జాతీయ జట్టుతోపాటు దేశవాళీ జట్టులో కూడా షా చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్లో కూడా ఆయనను ఏ ఫ్రాంచైజీ కొనలేదు.
News January 8, 2025
సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే?.. రామ్ చరణ్ అన్సర్ ఇదే
చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా ప్రభావం తమపై పడకుండా నాన్న చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారని హీరో రామ్ చరణ్ అన్నారు. ఆ తర్వాత తన మార్కులు చూసి ఏమవుతావని తన తండ్రి అడిగితే సినిమాల్లోకి వస్తానని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ సినిమాల్లో సక్సెస్ అవ్వకుంటే ప్లాన్-బి ఏమీ లేదన్నారు. డూ ఆర్ డై ఏదైనా ఇక్కడే అనుకున్నానని తెలిపారు. కాగా ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఎల్లుండి రిలీజ్ కానుంది.