News January 9, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 9, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.22 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు
✒ ఇష: రాత్రి 7.15 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 9, 2025
డిసెంబర్లో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల వరద
DECలో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.41,155CR పెట్టుబడులు వచ్చాయి. NOVతో పోలిస్తే ఇది 14.5% వృద్ధి. వరుసగా 46వ నెలా ఈ ఫండ్స్ పాజిటివ్ జోన్లోనే ఉండటం విశేషం. NIFTY, SENSEX నష్టపోతున్నా థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో MoM పద్ధతిన రూ.15,331CR ఇన్‌ఫ్లో వచ్చింది. ఇక 12 NFOల్లో రూ.11,337CR, స్మాల్‌క్యాప్ కేటగిరీలో రూ.4667CR పెట్టుబడులు వచ్చాయి. డెట్ ఫండ్స్ నుంచి రూ.1.27L CR వెనక్కి తీసుకున్నారు.
News January 9, 2025
‘గేమ్ ఛేంజర్’ మిడ్‌నైట్ షోలు ఆపాలని పిటిషన్.. HC సెటైరికల్ రిప్లై
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మిడ్ నైట్ షోలను నిలిపివేయాలని కొందరు ఏపీ హైకోర్టు(HC)ను ఆశ్రయించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు మరణించిన ఘటనను పేర్కొంటూ షోను నిలిపివేయాలని కోర్టును కోరారు. దీనికి ‘శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణిస్తే ప్రయోగాలు ఆపేయ్యాలి అన్నట్లుగా మీ అభ్యర్థన ఉంది’ అని హైకోర్టు వ్యంగ్యంగా స్పందించింది.
News January 9, 2025
కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్
TG: ఫార్ములా-ఈ రేస్ కేసులో KTRను ఏసీబీ విచారిస్తోంది. మధ్యలో లంచ్ విరామం ఇచ్చారు. లంచ్ తర్వాత తిరిగి విచారణ కొనసాగనుంది.