News January 19, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: జనవరి 19, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.28 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు
✒ ఇష: రాత్రి 7.20 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News October 14, 2025
వైకుంఠ గంగే స్వామివారి పుష్కరిణి

తిరుమల కొండతో పాటు, స్వామి పుష్కరిణిని కూడా గరుత్మంతుడు వైకుంఠం నుంచి భూమిపైకి తెచ్చాడు. ఇది శ్రీదేవి, భూదేవిలకు ప్రియమైనది. దీన్ని సర్వతీర్థాలకు జన్మస్థానంగానూ భావిస్తారు. విరజా నదిలా సకల పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఐహిక ఫలాలన్నీ లభిస్తాయి. ఈ పుష్కరిణిని దర్శించడం, స్మరించడం, సేవించడం వలన సమస్త శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 14, 2025
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 4 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDBM, PGDM, BSC, MSC(అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్కు నెలకు ₹90వేల నుంచి ₹2.40లక్షలు, సీనియర్ మేనేజర్కు ₹80వేల నుంచి ₹2.20లక్షలు జీతం అందుతుంది. వెబ్సైట్: https://www.nationalfertilizers.com/
News October 14, 2025
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

AP: కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, GNT జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరో 4 రోజులు కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది.