News January 21, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 21, మంగళవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు ✒ ఇష: రాత్రి 7.21 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 21, 2025
నెలాఖరున ‘RC16’లో జాయిన్ కానున్న చెర్రీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ ‘RC16’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్లో ఆయన పాల్గొంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 25% షూటింగ్ పూర్తి చేసుకున్న ‘RC16’ను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
News January 21, 2025
డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నాం: గంగూలీ
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్ గంగూలీ అండగా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలు కాగానే డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నామని చెప్పారు. హిట్‌మ్యాన్ వైట్‌బాట్ క్రికెట్ అద్భుతంగా ఆడతారని ప్రశంసించారు. CT-2025 ఫిబ్రవరి 19న మొదలు కానుండగా భారత్ తన తొలి మ్యాచ్ 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్ జట్టుతో ఆడనుంది.
News January 21, 2025
కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం
R.G.Kar ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు విధించటం పట్ల బెంగాల్ CM మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసు ‘అత్యంత అరుదు’ కాదన్న కోర్టు తీర్పు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ మెుదటి నుంచి దోషికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు మమత ట్వీట్ చేశారు.