News January 23, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 23, గురువారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 23, 2025

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, త్వరగా వాటిని భర్తీ చేయాలని MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. BRS నోటిఫికేషన్లను పూర్తి చేసి తమవిగా కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65ఏళ్లకు పెంచే ఆలోచనను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు. వయసు పెంచితే 40వేల ఉద్యోగాలకు గండి పడుతుందని చెప్పారు.

News January 23, 2025

రైలు ప్రమాదం వేదనకు గురిచేసింది: PM మోదీ

image

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తనను వేదనకు గురిచేసిందని PM మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే వదంతులతో ప్రయాణికులు చైన్ లాగి కిందకు దిగారు. పక్క ట్రాకుపై వెళ్తోన్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ వారిపై నుంచి దూసుకెళ్లగా 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

News January 23, 2025

రోజూ యాలకులు తింటున్నారా!

image

ప్రతి రోజు యాలకులను నమిలి రసం మింగితే పలు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయని అంటున్నారు. అలాగే యాలకులను డైలీ తీసుకుంటే గుండె సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తశాతం పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. యాలకులను తినడం వల్ల రక్తశుద్ధి జరిగి విష, వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.