News February 3, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 03, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News March 24, 2026
IPLకు ముందు సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన గిల్

IPLకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. తనలోని ప్రశాంతతకు తనపై తనకు ఉన్న నమ్మకం, జట్టు ఇచ్చే భరోసాయే కారణమని తెలిపారు. సోమవారం జరిగిన ‘శుభారంభ్ 2026’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రశాంతంగా ఉండటం వల్ల పరిస్థితులను స్పష్టంగా అంచనా వేయొచ్చని, అది లాంగ్ టర్మ్ విజన్ ఇస్తుందని చెప్పారు. కోచ్ ఆశిష్ నెహ్రా కూడా తమ లక్ష్యం గెలవడమేనని స్పష్టం చేశారు.
News March 24, 2026
యుద్ధం.. అమెరికాతో జైశంకర్ చర్చలు

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై చర్చించారు. ముఖ్యంగా హార్ముజ్ వివాదం నేపథ్యంలో ఇంధన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఐదు రోజులు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 దేశాలు నిరంతరం టచ్‌లో ఉండాలని నిర్ణయించాయి.
News March 24, 2026
ట్రంప్ ప్రకటనతో దిగొచ్చిన చమురు ధరలు

ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధ భయాలు తగ్గాయి. దీంతో చమురు ధరలు 13% మేర దిగొచ్చి $95 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సోమవారం ఉదయం భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు సాయంత్రానికి మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ₹1.46 లక్షల వరకు చేరింది. ఈ సానుకూల పవనాలతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


