News February 4, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 04, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News February 4, 2025

‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

image

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మింట్‌లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.

News February 4, 2025

ఆస్తులపై పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం: కేంద్ర హోంశాఖ

image

విభజన సమస్యలను తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై AP, TG అధికారులతో ఆయన చర్చించారు. ఆస్తులు తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు సమాచారం.

News February 4, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుజనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యలేని నీచుడి దగ్గరకు వెళ్లకూడదు. వాటి వల్ల ప్రమాదం ఉంటుంది.