News February 11, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 11, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 25, 2025

AIIMS రాయ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

image

<>AIIMS <<>>రాయ్‌పూర్ 29 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతగల అభ్యర్థులు ఎల్లుండి వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in

News October 25, 2025

హైదరాబాద్‌లో స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్?

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ మన దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశంలోని 9 సిటీల్లో ఎర్త్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్‌కతా, లక్నో తదితర నగరాలు ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా టెస్టింగ్ దశలో స్టార్‌లింక్‌కు కఠిన ఆంక్షలతో కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.

News October 25, 2025

తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

image

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.