News February 20, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 20, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 9, 2026

ALERT: ఆ పత్తి విత్తనాలు కొనొద్దు

image

TG: కేంద్రం అనుమతి లేని HT(Herbicide tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ అభివృద్ధి చేసింది. అయితే ఫీల్డ్ ట్రయల్స్‌లో ఇవి విఫలమవ్వడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ విత్తనాల వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రైతులు వీటిని కొని ఇబ్బందిపడొద్దని మంత్రి సూచించారు.

News January 9, 2026

నేటి నుంచి WPL.. MI, RCB మధ్య తొలి మ్యాచ్

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2026) నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఛాంపియన్ టీమ్స్ ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో 7.30PMకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. MIకి హర్మన్ ప్రీత్, RCBకి స్మృతి మంధాన కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 3 సీజన్లు జరగగా MI రెండు సార్లు (2023, 25), RCB (2024) ఒకసారి టైటిల్ గెలిచాయి. హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News January 9, 2026

అక్రమంగా HT పత్తి విత్తనాల అమ్మకం.. కొంటే నష్టం

image

TG: కొంత మంది దళారులు HT పత్తి విత్తనాలను మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి తెచ్చి తెలంగాణ సరిహద్దుల్లో రైతులకు అమ్ముతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. HT విత్తనాలు కలుపును తట్టుకొని అధిక దిగుబడినిస్తాయని దళారులు చెబుతున్నారు. అయితే HT విత్తనాలతో కలుపు పెరిగి, అధికంగా నివారణ మందులు వాడాల్సి వస్తుందని, దీని వల్ల పర్యావరణానికి హానితో పాటు ఇతర హైబ్రిడ్ విత్తనాలు కలుషితమవుతాయని మంత్రి తుమ్మల హెచ్చరించారు.