News February 23, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 23, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు అసర్: సాయంత్రం 4.43 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News February 23, 2025

జీతాలు 9.2 శాతం పెరుగుతాయ్: Aon సర్వే

image

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ ఈ ఏడాది భారత్‌లో <<15458704>>వేతనాలు<<>> సగటున 9.2 శాతం పెరుగుతాయని Aon PLC అంచనా వేసింది. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ 45 రంగాలకు చెందిన 1,400కు పైగా కంపెనీల నుంచి వివరాలు సేకరించింది. ఆటోమోటివ్, వెహికల్ తయారీ విభాగాల్లో అత్యధికంగా 10.2 శాతం పెంపు ఉండొచ్చని పేర్కొంది. ఆ తర్వాత NBFC(10%), రిటైల్(9.8%), ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్(9.5%) రంగాలు ఉంటాయంది.

News February 23, 2025

25న MLAల అనర్హత కేసు విచారణ

image

తెలంగాణలో పార్టీ మారిన MLAలపై అనర్హత వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో 25న విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు విననుంది. BRSలో గెలిచిన MLAలు పోచారం, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం, తెల్లం, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని KTR సహా BRS నేతలు ఈ పిటిషన్లు వేశారు.

News February 23, 2025

పబ్లిక్ ఇష్యూకు ప్రభుత్వ పవర్ సంస్థలు!

image

ప్రభుత్వ రంగానికి చెందిన 5 విద్యుత్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. అవసరమైన నిధులు సమీకరించేందుకు IPO ద్వారా వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ సంస్థలు పబ్లిక్ ఇష్యూ కోసం బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. మరో 3 డిస్కమ్‌లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!