News March 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 12, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 15, 2026

తిరుమలలో వరుస సెలవులతో భక్తజనసంద్రం

image

వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు చేరగా, దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పడుతోంది. రూములు దొరక్క కొందరు భక్తులు లాకర్లు, ఆరుబయటే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాలినడక మార్గాల్లోనూ భారీ రద్దీ కొనసాగుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు పడుతుండగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

News January 15, 2026

కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

image

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్‌లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.

News January 15, 2026

దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

image

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.