News March 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 16, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు ఇష: రాత్రి 7.38 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 7, 2026

ఫోన్ ట్యాపింగ్.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్‌రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఇటీవల నవీన్‌రావు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

News January 7, 2026

పండుగకి ఊరెళ్తున్నారా?

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇల్లు విడిచి వెళ్లేముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించడం శ్రేయస్కరం. ఇంటికి రెండు ద్వారాలు ఉంటే రహదారికి కనిపించే తలుపుకు లోపల, మరో వైపున్న తలుపుకు బయటివైపు తాళం వేయాలి. ఆ తాళం బయటకు కనిపించకుండా కర్టైన్స్ వేయడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో బంగారం, నగదు వదిలి వెళ్లవద్దని కోరుతున్నారు.

News January 7, 2026

కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత, లిట్టర్ నిర్వహణ కీలకం

image

శీతాకాలంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ సమయం ఉండటం వల్ల కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత విషయంలో, నేల మీద పరిచే వరిపొట్టు(లిట్టర్) విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టులో తేమ పెరగకుండా 7 నుంచి 11 కిలోల పొడి సున్నం లేదా సూపర్ ఫాస్ఫేట్ 100 చదరపు అడుగుల లిట్టర్‌కు చేర్చాలి. వారానికి 2-3 సార్లు లిట్టర్‌ను కలియబెట్టాలి. ఇలా చేయడం వలన లిట్టర్‌లో తేమ తగ్గి కోడిపిల్లలు కోకిడియోసిస్‌కు గురి కాకుండా కాపాడుకోవచ్చు.