News March 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 18, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News October 29, 2025
రేపే సెమీస్.. ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తారా?

ICC టోర్నీల్లో అన్‌లక్కీయెస్ట్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రేపు WWC తొలి సెమీస్‌లో ENGతో తలపడనుంది. గెలిస్తే వన్డే WC చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరనుంది. SA మెన్స్&ఉమెన్స్ టీమ్స్ ఎంత పటిష్ఠంగా ఉన్నా నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తాయి. ఈసారైనా ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఈనెల 30న రెండో సెమీస్‌లో IND, AUS తలపడనున్నాయి.
News October 29, 2025
విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్‌ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్‌తో పాటు అక్కడి 25KV ట్రాన్స్‌ఫార్మర్‌నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
News October 29, 2025
మళ్లీ యుద్ధం.. గాజాపై భీకర దాడులకు ఆదేశం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. గాజాపై పవర్ఫుల్ స్ట్రైక్స్ చేపట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మిలిటరీని ఆదేశించారు. హమాస్ పీస్ డీల్‌ను ఉల్లంఘించిందని, ఇజ్రాయెలీ బందీల మృతదేహాలు, అవశేషాలను ఇంకా అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో తమ బలగాలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. దీంతో యుద్ధం మళ్లీ మొదలవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


