News March 22, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 22, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.40 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News March 22, 2025
1 స్కీమ్: ₹1.61LCR పెట్టుబడి, 11.5లక్షల జాబ్స్

PLI స్కీమ్స్‌తో ₹1.61L CR పెట్టుబడులు, ₹14L CR ప్రొడక్షన్, ₹5.31L CR ఎగుమతులు నమోదయ్యాయని కామర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.5లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపింది. 14 రంగాల్లో 764 దరఖాస్తుల్ని ఆమోదించామని పేర్కొంది. బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజులు, ఫార్మా, టెలికం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, డ్రోన్స్ రంగాల్లో 176 MSMEలు లబ్ధి పొందాయని వెల్లడించింది.
News March 22, 2025
డీలిమిటేషన్‌పై వారివి అపోహలే: కిషన్ రెడ్డి

TG: డీలిమిటేషన్ ఇంకా ప్రారంభం కాలేదని, కాంగ్రెస్, DMK, BRS మాత్రం ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. BJPపై విషం కక్కడమే వారి ఎజెండా అని విమర్శించారు. ‘డీలిమిటేషన్ పూర్తి కాకుండానే దక్షిణాదికి అన్యాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ కుట్ర చేస్తున్నారు. సౌత్, నార్త్ మధ్య విభజన తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి’ అంటూ ఫైర్ అయ్యారు.
News March 22, 2025
వ్యంగ్యంగా మాట్లాడితే కేసులు పెడతారా?: అంబటి

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి హాస్యనటుడు కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడారని, అంతమాత్రానికే కేసులు పెడతారా అని YCP నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మరి దగ్గుబాటి కూడా చంద్రబాబుపై వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. ‘YCP నేతలపై అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదిలేది లేదు. మా లీగల్ టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా క్షణాల్లో వస్తాం’ అని పేర్కొన్నారు.