News April 24, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 24, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.39 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.54 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.50 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News April 24, 2025

స్విట్జర్లాండ్‌ వీసా రిజెక్ట్.. మినీ స్విట్జర్లాండ్‌లో ఉగ్రతూటాకు బలి

image

ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ ఉదంతంలో మరో హృదయవిదారక అంశం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న అతను హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రిజెక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా భావించే పహల్‌గామ్ వెళ్లి ఉగ్రతూటాకు బలయ్యారు. అతడికి చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని ఉండేదని, అందుకే నేవీలో చేరాడని పేరెంట్స్ చెప్పారు.

News April 24, 2025

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు

image

AP: అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 2025-26 విద్యాసంవత్సరంలో 25% ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఫస్ట్ క్లాస్‌లో సీట్ల కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా ధ్రువీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు అవసరం. విద్యార్థుల వయసు 01.06.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/

News April 24, 2025

సర్జికల్ స్ట్రైక్స్ వార్తలు.. పాక్ సరిహద్దు గ్రామాలు ఖాళీ?

image

J&K పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో గుబులు మొదలైంది. ISI హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా సరిహద్దు గ్రామాలను ఆర్మీ ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌ఫోర్స్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉరి దాడికి కౌంటర్‌గా 2016లో POK, పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!