News September 8, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 8, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.24 గంటలకు
✒ ఇష: రాత్రి 7.37 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 19, 2026
పండ్లు Vs పండ్ల రసాలు.. ఏవి బెటర్?

పండ్ల రసం తాగడం కంటే నేరుగా పండ్లను తినడమే చాలా ఉత్తమమని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ‘ఫ్రూట్స్‌లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కానీ పండ్ల రసంలో పీచుపదార్థాలు ఎక్కువగా తొలగిపోతాయి. దీంతో చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్, PCOD, ఒబెసిటీ, గుండె వ్యాధులు ఉన్న వారికి జ్యూస్ మంచిది కాదు’ అని చెబుతున్నారు.
News January 19, 2026
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
News January 19, 2026
PPP విధానంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి

AP: రాష్ట్రంలోని ప్రధాన RTC బస్టాండ్లను PPP విధానంలో ₹958 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోనగర్ (విజయవాడ), గుంటూరు, కర్నూలు, మద్దిలపాలెం (విశాఖ), చిత్తూరు బస్టాండ్ల విస్తరణ, ఆధునికీకరణ చేయనున్నారు. తిరుపతి బస్టాండ్ అభివృద్ధి పనులు కేంద్ర సహకారంతో ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రైవేటు సంస్థలు ముందుకు రాగానే ఇతర బస్టాండ్ల పనులూ చేపడతారు.


