News September 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 28, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.54 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.06 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.07 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.27 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 15, 2026
పాక్‌తో ఇవాళే మ్యాచ్.. చక్ దే ఇండియా!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు వేళయింది. T20 WCలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు <<19134206>>మ్యాచ్ ప్రారంభం<<>> కానుంది. ఈ టోర్నీ చరిత్రలో పాక్‌తో ఆడిన 8 మ్యాచుల్లో 7 మన జట్టే గెలిచింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ టీమ్‌ను మట్టికరిపించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో అభిషేక్, సూర్య, బౌలింగ్‌లో బుమ్రా, వరుణ్ చెలరేగితే గెలుపు మనదే. చక్ దే ఇండియా!
News February 15, 2026
శివ నామాలు అర్థాలు ‘‘కాలభైరవ’’

శివుని ఉగ్ర రూపాలలో ‘కాలభైరవుడు’ శక్తివంతమైనది. ‘కాల’ అంటే సమయం అని అర్థం. సమయాన్ని శాసించేవాడు, కాలాన్ని మింగేసేవాడు కాబట్టి ఆయన కాలభైరవుడు. ముఖ్యంగా కాశీ క్షేత్రానికి ఈయనే రక్షకుడు(క్షేత్ర పాలకుడు). తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించే అధికారం ఈయనకు ఉంటుంది. భక్తుల భయాన్ని పోగొట్టి, శత్రువుల నుంచి రక్షించే దైవం ఈయన. మనలోని అహంకారాన్ని అంతం చేసి మోక్షమార్గాన్ని చూపే దైవంగా ఈయనను ఆరాధిస్తారు.
News February 15, 2026
రష్యా ఆయిల్ ఆపేస్తామని ఇండియా హామీ ఇచ్చింది: రుబియో

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపేస్తామని ఇండియా తమకు హామీ ఇచ్చిందని US విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు విధించాం. అదనపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని చర్చల సందర్భంగా భారత్ మాటిచ్చింది’ అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఇండియా తమ ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప <<19115659>>ఇంకెవరూ చెప్పలేదని<<>> రష్యా విమర్శించడం తెలిసిందే.


