News November 19, 2024

తెలుగు రాష్ట్రాల్లో నేటి కార్యక్రమాలు

image

☛ వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన, ప్రజాపాలన విజయోత్సవ సభ
☛ ఖమ్మంలో బీసీ డెడికేషన్ కమిషన్ పర్యటన
☛ లగచర్ల కేసు.. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
☛ ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం (1.సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లు, 2.ఎక్సైజ్, 3.విదేశీ మద్యం వాణిజ్యం, 4. ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు)
☛ నేడు పోలీసుల కస్టడీకి బోరుగడ్డ అనిల్

Similar News

News November 19, 2024

‘కాళేశ్వరం’పై విచారణ.. ఈనెలాఖరున KCRకు పిలుపు!

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్‌కుమార్, రజత్‌కుమార్, స్మితా సబర్వాల్‌, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

News November 19, 2024

భారత్ ఫైబర్ (BSNL)పై పెరుగుతోన్న ఆసక్తి!

image

BSNLలో 5G అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు ఈ నెట్‌వర్క్‌లోకి మారేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే భారత్ ఫైబర్ (తక్కువ ధరకే WiFi)పైనా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలో మొత్తం 28.8 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడు‌లోనే దాదాపు 9లక్షల కనెక్షన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక APలో 1.7లక్షలు, TGలో 0.9లక్షల కనెక్షన్లున్నాయి.

News November 19, 2024

ఇందిరా గాంధీకి మోదీ నివాళి

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అలాగే రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగానూ ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె చూసిన ధైర్యసాహసాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు. కష్టకాలంలో ఆమె నాయకత్వం నిజమైన సంకల్పం ఏమిటో చూపించిందన్నారు.