News March 18, 2024
నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ఇవాళ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు అందించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.
Similar News
News December 24, 2025
వర్ధన్నపేట: ఏటీఎంలో కేటుగాడు

వర్ధన్నపేట ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద రైతు పిన్నింటి కిషన్‌రావు మోసానికి గురయ్యాడు. నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో దుండగుడు అతని ఏటీఎం కార్డును మార్చి రూ.40 వేల నగదు కాజేశాడు. గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసగాడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
News December 24, 2025
వరంగల్ ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు

వరంగల్ డివిజన్ వ్యాప్తంగా 8 మంది ఎస్సైలకు సీఐగా పదోన్నతి కల్పించేందుకు డీపీసీ సిఫారసులను కమిషనర్ సి.హరికిరణ్ ఆమోదించారు. రోస్టర్ ప్రకారం రమాదేవి, రజిత, చంద్రశేఖర్, జ్యోతి, సరిత, అశోక్‌కుమార్ తదితరులకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అలాగే శ్రీనివాస్‌రెడ్డి, మురళి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా, అంజన్‌రావు జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. జీవో విడుదల అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
News December 21, 2025
జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

భోపాల్‌లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.


