News March 16, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

*ఎల్లారెడ్డిపేట మండలంలో కారు ఢీకొని వ్యక్తి మృతి.
*మెట్పల్లి మండలం ఆరపేటలో ముగ్గురు మహిళలను ఢీ కొట్టిన కారు.. తీవ్ర గాయాలు.
*జగిత్యాలలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వైద్యుడి అరెస్ట్
*ఎన్నికల నియమావళిని పాటించాలన్న సిరిసిల్ల కలెక్టర్.
*రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దన్న SRCL ఎస్పీ.
*జగిత్యాలలో ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు.
*రాయికల్ మండలంలో వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి.
Similar News
News April 11, 2025
KNR: సెర్ప్ సిబ్బందితో సమీక్షా సమావేశం

కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రపుల్ దేశాయ్ అధ్యక్షతన సెర్ప్ సిబ్బంది (DPMs/APMs/CCs & VOAs) తో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఐ.కె.పి ద్వారా చేపట్టబోయే (138) PPC లలో పారదర్శకంగా తూకం వేయాలని ఆదేశించారు. తేమ శాతాన్ని సరైన విధంగా చూస్తూ, తాలు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలుకు సంబంధించిన రికార్డ్ను డాటా ఎంట్రీని సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.
News April 11, 2025
శంకరపట్నం: సన్న బియ్యం పథకం విప్లవాత్మకం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం అమలు చేయడం విప్లవాత్మకమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గురువారం సన్న బియ్యం లబ్దిదారుడు చలిగంటి గణేశ్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ సహపంక్తి భోజనం చేశారు.
News April 10, 2025
రామగుండంలో భూకంపం?

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో భూకంపం దాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే, రామగుండంలో ఏప్రిల్ 10-17 మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు Epic (Earthquake Research & Analysis) తెలిపింది. తమ పరిశోధన, విశ్లేషణ ప్రకారం రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ట్విట్టర్లో పేర్కొంది.