News March 16, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఏసీబీ వలలో జలమండలి అధికారులు
> ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. నగర వ్యాప్తంగా నిరసనలు
> ఓయూలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
> లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమీక్ష సమావేశం
> లాలాపేటలో రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగునీరు
> అమీన్‌పూర్ PS పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం
> జీడిమెట్లలో 5 కేజీల గంజాయి స్వాధీనం
> హయత్‌నగర్-ఎల్బీనగర్ రూట్‌లో వాహన తనిఖీలు చేసిన పోలీసులు

Similar News

News January 15, 2026

BREAKING: HYD: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

image

పటాన్‌చెరు నియోజకవర్గంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 15, 2026

BREAKING: టెర్రస్ వార్‌.. HYDలో చిందిన రక్తం

image

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

News January 15, 2026

HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

image

​శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.