News May 1, 2024
టుడే టాప్ స్టోరీస్

➥తెలంగాణలో RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: మోదీ
➥తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు: సీఎం రేవంత్
➥రేవంత్‌పై విచారణకు ఈడీ, ఐటీని దించాలి: కేసీఆర్
➥AP: నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. బాబుది బోగస్ రిపోర్ట్: జగన్
➥టీడీపీ-జనసేన ప్రజా మేనిఫెస్టో విడుదల
➥వ్యవసాయానికి 9గంటల విద్యుత్ ఇస్తా: చంద్రబాబు
➥T20WCకు భారత జట్టు ప్రకటన
Similar News
News March 10, 2026
కాసేపట్లో ఇరాన్‌పై భీకర దాడులు: అమెరికా

ఇరాన్‌పై కాసేపట్లో ఎప్పుడు లేనంత స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రకటించారు. తాము అనుకున్న సమయానికే ఇరాన్‌తో యుద్ధం ఆపుతామని తెలిపారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. మరోవైపు యూఏఈలోనే అతిపెద్దదైన రువాస్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడి జరిగింది. దీంతో రిఫైనరీ తాత్కాలికంగా మూతపడింది.
News March 10, 2026
AP, TG ఎంత అప్పు చేశాయంటే?

2025-26 ఆర్థిక సంవత్సరం 9నెలల్లో AP రూ.56,072Cr, TG రూ.69,300Cr అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. RSలో YCP MP బాబూరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తొలి త్రైమాసికంలో AP రూ.26,572Cr, TG రూ.17,400Cr, రెండో క్వార్టర్‌లో AP రూ.17,600Cr, TG 32,500Cr, మూడో క్వార్టర్‌లో AP రూ.11,900Cr, TG రూ.19,400Cr ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేసినట్లు వివరించారు.
News March 10, 2026
ఏజెన్సీల ‘బ్లాక్’ దందా.. భారీ ధరకు సిలిండర్ల విక్రయం!

LPG సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏజెన్సీలు సాధారణ బుకింగ్స్ యాక్సెప్ట్ చేయకుండా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్యాస్ సప్లైలో అంతరాయం ఏర్పడొచ్చని, చూసి వాడుకోవాలంటూ గేటెడ్ కమ్యూనిటీల్లో యాజమాన్యాలు అలర్ట్ SMSలు పంపుతున్నాయి.


