News July 12, 2024
టుడే టాప్ స్టోరీస్
➥AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు: కేంద్రమంత్రి కుమారస్వామి
➥2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి: CM చంద్రబాబు
➥75% హాజరు ఉండే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ పథకం
➥AP: 19 మంది IAS, 9 మంది IPSల బదిలీ
➥TG: DSC హాల్ టికెట్లు విడుదల
➥రేపు కాంగ్రెస్‌లోకి BRS MLA ప్రకాశ్ గౌడ్
➥యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్
➥BSF, CISF కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు 10% రిజర్వేషన్
Similar News
News January 19, 2025
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. తన కొడుకును ఉరి తీయాలన్న తల్లి
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చడంపై అతని తల్లి మాలతి(70) స్పందించారు. తన కొడుకు చేసిన తప్పును మహిళగా క్షమించబోనని స్పష్టం చేశారు. తనకూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలి తల్లి బాధను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా అభ్యంతరం లేదన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని సంజయ్ సోదరి కూడా తేల్చిచెప్పారు.
News January 19, 2025
సైఫ్, కరీనా నవ్వుతున్న AI ఫొటో.. ఎంపీపై విమర్శలు
సైఫ్ అలీఖాన్‌పై దాడి దురదృష్టకరమని నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. ఆయన త్వరగా కోలుకుంటున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ బెడ్‌పై, కరీనా పక్కనే కూర్చుని నవ్వుతున్నట్లు ఉన్న AI జనరేటెడ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి ఫొటోలు పంచుకోవడం అవసరమా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. అయితే దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.
News January 19, 2025
సైఫ్ నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీ
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడికి బాంద్రా కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇవాళ తెల్లవారుజామున అతడిని థానేలో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో దాడికి గల ప్రధాన కారణాలపై నిందితుడిని పోలీసులు ప్రశ్నించనున్నారు.