News August 3, 2024
టుడే టాప్ స్టోరీస్

➦TG: టీచర్ల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు: సీఎం రేవంత్
➦TG:అసెంబ్లీలో దానం నాగేందర్ బూతులు.. BRS ఆగ్రహం
➦నిరుద్యోగులను రెచ్చగొట్టి గెలిచారు: కేటీఆర్
➦TG:ఉద్యోగ నియామకాల క్యాలెండర్ విడుదల
➦AP: ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు చంద్రబాబు ఆదేశం
➦AP: రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ మరో ఐదేళ్లు పొడిగింపు
➦ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది: మంత్రి సత్యకుమార్
➦భారత్- శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై
Similar News
News March 10, 2026
మెగా కోడలికి ఆన్‌లైన్ వేధింపులు.. కేసు నమోదు

తనపై ఓ వ్యక్తి SMలో వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసేలా ‘Purple Crayon00’ ఇన్‌స్టా ఖాతా ద్వారా పోస్టులు, కామెంట్లు చేస్తున్నాడు. నా కుటుంబీకులనూ దూషిస్తూ అవమానిస్తున్నాడు. అతడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
‘సారా’.. మళ్లీ కావాలంటోన్న MLA సారు.. మీరేమంటారు?

ఉమ్మడి APలో సారా సామాజిక, ఆర్థిక, కుటుంబ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. దానికి వ్యతిరేకంగా దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో ఎంతో మంది తిరుగుబాటు చేయడంతో సారా నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు TGలో సారా షాపులు ఓపెన్ చేయాలని MLA అనిరుధ్ డిమాండ్ చేయడం <<19339452>>చర్చనీయాంశమవుతోంది<<>>. గతంలో సారా తాగి 115 ఏళ్లు బతికారంటూ అన్‌సైంటిఫిక్ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు?
News March 10, 2026
వాళ్ల ఒత్తిడితోనే వెనక్కి తగ్గిన ట్రంప్?

ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనమైందని ట్రంప్ చెబుతున్నా.. యుద్ధం ముగింపునకు వచ్చిందన్న ప్రకటన వెనక ఆయన అడ్వైజర్ల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ధరలు పెరగడం, US ప్రజల మద్దతు లేకపోవడం, ఇరాన్ తగ్గే సూచనలు కనిపించకపోవడం, మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఎక్కడ డెమోక్రాట్లకు ప్లస్ అవుతుందోనన్న భయం ఉన్నట్లు సమాచారం.


