News August 7, 2024
సునీతా విలియమ్స్పై ఈరోజు అప్డేట్: నాసా

బోయింగ్ స్టార్లైనర్ విమానంలో ఇబ్బందుల కారణంగా బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ ISSలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వెళ్లిన వారానికి వెనక్కి రావాల్సిన వీరు ఈ ఏడాది జూన్ 6 నుంచి అక్కడే ఉండిపోయారు. సునీత ఆరోగ్యం బాలేదంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నాసా ఈరోజు రాత్రి 10గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనుంది. ఆమె పరిస్థితి సహా పూర్తి ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వనున్నట్లు నాసా పేర్కొంది.
Similar News
News September 14, 2025
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.!

పుత్తూరు కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 214 కేసులను పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. వివిధ కేసులలో ఉన్న 4979 మంది మధ్య రాజీ చేసి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర తెలిపారు. ఇందులో భాగంగా బలరామన్-రంజిత దంపతులను కలిపినట్లు ఆయన తెలిపారు.
News September 14, 2025
SBIలో 122 పోస్టులు

<
News September 14, 2025
కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT