News October 8, 2025

టుడే అప్డేట్స్

image

* లగ్జరీ కార్ల కేసు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో సహా చెన్నై, కొచ్చిలోని 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు
*TG: పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు(టాయిలెట్లు, తాగునీరు, టెంట్లు) కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశం
* ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. దేశాభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయంపై చర్చ

Similar News

News October 8, 2025

మోదీకి కంగ్రాట్స్ చెప్పిన జగన్

image

ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ చీఫ్ జగన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ‘ఈ మైలురాయి దేశసేవ పట్ల మీ అంకితభావం, పట్టుదల, నిబద్ధతను తెలియజేస్తోంది. మీరు ఇలాగే పని చేస్తూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

News October 8, 2025

రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధిస్తాం: ఉత్తమ్

image

తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దీని నుంచి 1.48 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు. 90.46 లక్షల టన్నుల సన్నాలు, 57.84 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యం పంట చేతికొస్తుందని చెప్పారు. క్వింటాల్ సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని.. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం కొంటుందన్నారు.

News October 8, 2025

జుట్టు రాలిపోతోందా? ఇవి మీ డైట్‌లో ఉంటే..!

image

చాలామందికి యుక్త వయసులోనే జుట్టు రాలిపోతుండటం ఆందోళనకరం. జుట్టు బలంగా ఉండేందుకు ఎన్ని షాంపులు, నూనెలు వాడినా శరీరానికి పోషకాలు అందడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. రోజూ గుమ్మడి గింజలు తింటే జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయని సూచిస్తున్నారు. వీటిల్లో జింక్, మెగ్నీషియం, కుకుర్బిటాసిన్ అమైనో యాసిడ్స్‌తో పాటు సహజ నూనెలు DHT హార్మోన్‌ను అడ్డుకొని జుట్టు రాలడాన్ని నిరోధించి వృద్ధికి తోడ్పడతాయట.