News February 20, 2025
టాయిలెట్ బ్రేక్ 2 నిమిషాలే.. దాటితే శాలరీ కట్!

చైనాలోని ఓ సంస్థ FEB 11 నుంచి అమలు చేస్తున్న ఓ రూల్ విమర్శలు ఎదుర్కొంటోంది. త్రీ బ్రదర్స్ మెషీన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ టాయిలెట్లను వినియోగించడానికి టైమ్ స్లాట్స్ తెచ్చింది. ఉద్యోగి ఆ టైమ్ స్లాట్స్లో 2 నిమిషాలే బాత్రూమ్కు వెళ్లాలి. దాటితే శాలరీలో కోత విధిస్తారు. అత్యవసరమైతే HR పర్మిషన్ తీసుకోవాలి. క్రమశిక్షణ, మెరుగైన పనితీరు కోసం ఈ రూల్ తెచ్చినట్లు ఆ కంపెనీ చెబుతోంది. దీనిపై మీ COMMENT.
Similar News
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
News December 10, 2025
అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


