News July 27, 2024
గ్రామాల్లో టోల్ వసూళ్లు.. FACT CHECK

AP: గ్రామాలు, మండలాల్లో టోల్ వసూలు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. కొంతమంది దురుద్దేశంతో సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని తెలిపింది. ‘ప్రైవేటు భాగస్వామ్యంతో గ్రామాలు, మండలాల్లో రోడ్లకు టోల్ వసూలు చేయాలని, వాటితో రహదారులు నిర్మించాలని నిర్ణయించారు’ అని ప్రచారంలో ఉన్న కథనం అవాస్తవమని స్పష్టం చేసింది.
Similar News
News November 15, 2025
ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.
News November 15, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(<
News November 15, 2025
బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.


