News August 23, 2025
త్వరలో MHలో ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ?

ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రంలోని హైవేలపై టోల్ ఛార్జీలను మహారాష్ట్ర ప్రభుత్వం మినహాయించనుంది. ఇప్పటికే అటల్ సేతు, పుణే ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్‌లపై ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలకు దీనిని విస్తరించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. కాలుష్యం తగ్గించడం, EVల కొనుగోలు ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News August 23, 2025
రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం: షర్మిల

AP: రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల వాపోయారు. తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల వద్ద రైతులు కి.మీ. మేర క్యూలు కడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతు సేవా, మార్క్ ఫెడ్, సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఇది నిజంగా కొరతనా, లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతనా అని నిలదీశారు.
News August 23, 2025
డబ్బు కోసమే సహస్ర హత్య: తండ్రి కృష్ణ

TG: HYD కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్యపై ఆమె తండ్రి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ‘క్రికెట్ బ్యాట్ కోసం కాదు.. డబ్బు కోసమే ఆ బాలుడు మా ఇంట్లోకి వచ్చాడు. ఈ హత్య వెనుక బాలుడి పేరెంట్స్ హస్తం కూడా ఉంది. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి. మాకు న్యాయం జరగకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News August 23, 2025
రిజర్వేషన్లు, ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక సమీక్షలు

TG: బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై CM రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో PCC కోర్ కమిటీతో సమావేశమయ్యారు. మీనాక్షి, భట్టి, మహేశ్, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం గాంధీభవన్‌కు వెళ్లారు. అక్కడ జరిగే PAC సమావేశంలో BC రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.