News September 10, 2025
‘ఇందిరమ్మ ఇళ్ల’ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. HYD హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌ను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. 18005995991 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లబ్ధిదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.
Similar News
News September 10, 2025
భారత్ దెబ్బ.. దారికొస్తున్న ట్రంప్!

భారత్‌పై పెత్తనం చెలాయిద్దామనుకుంటున్న ట్రంప్ పాచికలు పారడం లేదు. 50% టారిఫ్స్ వేసినా ఇండియా వెనక్కి తగ్గలేదు. రష్యాతో ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచింది. చైనాతోనూ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరిస్తోంది. ఇవన్నీ మింగుడుపడని ట్రంప్ దెబ్బకు దిగొచ్చారు. ట్రేడ్ విషయంలో IND-US సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు వస్తాయనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. PM మోదీతో <<17663735>>మాట్లాడేందుకు<<>> ఎదురుచూస్తున్నానని చెప్పడం కొసమెరుపు.
News September 10, 2025
రూ.200 కోట్ల క్లబ్‌లో ‘కొత్త లోక’

‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, కళ్యాణీ ప్రియదర్శన్ జంటగా నటించిన ‘కొత్త లోక’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 13 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. డొమినిక్ అరుణ్ రూపొందించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. గత నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ.
News September 10, 2025
1,543 ఇంజినీరింగ్ పోస్టులు

<