News March 23, 2025
హీరోయిన్తో టాలీవుడ్ డైరెక్టర్ డేటింగ్?

సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తమిళ హీరోయిన్ బ్రిగిడా సాగాతో డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భార్యతో దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల బ్రిగిడకు దగ్గరయ్యారని సినీ వర్గాలంటున్నాయి. ఈ పుకార్లపై వారు స్పందించాల్సి ఉంది. కాగా బ్రిగిడాతో శ్రీకాంత్ పెదకాపు-1 సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించిందని సమాచారం.
Similar News
News November 21, 2025
మరికొన్ని గంటల్లో భారీ వర్షం

AP: బంగాళాఖాతంలో రేపు <<18351099>>అల్పపీడనం<<>> ఏర్పడనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి రేపు ఉ.9 గంటల వరకు తిరుపతి, నెల్లూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు మధ్యాహ్నానికి చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే.
News November 21, 2025
బ్రెయిన్ స్ట్రోక్కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.