News January 21, 2025
తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా తాను ప్రేమించిన హీరోయిన్ రహస్య గోరక్‌ను కిరణ్ గత ఆగస్టులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 4, 2025
కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి?: MP

TG: కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్ సభలో BJP MP విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ పరిధిలోకి రాదంటూ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ‘ఇది చిన్న విషయంగా నవ్వుతారు కానీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న పెద్ద సమస్య. సర్పంచి ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారింది. సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తామని జనం అంటున్నారు. కోతులు ఏ శాఖ కిందికి వస్తాయో వెల్లడించాలి’ అని కోరారు.
News December 4, 2025
నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్ ఆస్తా పూనియా

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు ఆస్తా పూనియా. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరర్‌కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేశారు. నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఫైటర్ స్ట్రీమ్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారామె. ఎంతోమంది యువతులకు రోల్‌మోడల్‌గా నిలిచింది.
News December 4, 2025
డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.


