News June 18, 2024
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే

ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన టాలీవుడ్ అంటే తనకు ప్రత్యేకమని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. నటనకు ప్రాంతీయ బేధం లేదని, ఏ భాషలోనైనా తనకు కంఫర్ట్‌గానే ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే తెలుగులో ఓ మంచి సినిమాలో నటిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు.
Similar News
News October 22, 2025
కార్తీక మాసంలో శివపూజ.. యముడు కూడా ఏం చేయలేడట

కార్తీక మాసంలో శివారాధన విశిష్టమైనది. ఆయనను పూజించే వారికి అపమృత్యు భయాలుండవని నమ్మకం. ఓనాడు శివుడి పరమ భక్తుడైన మార్కండేయుడిని సంహరించడానికి వెళ్లిన యముడిని, శివుడు సంహరించాడు. లోక కళ్యాణం కోసం తిరిగి బతికించి, తన భక్తుల విషయంలో అచిరకాల నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించాడు. ఆనాటి నుంచి శివభక్తులపై యమ పాశాన్ని ప్రయోగించడానికి యముడు వెనుకాడతాడని విశ్వసిస్తారు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేయాలంటారు.
News October 22, 2025
ఇలా చేస్తే మీ గుండె పదికాలాలు పదిలమే: వైద్యులు

వరుసగా 40 పుష్-అప్స్ చేయగలిగే వారికి గుండెపోటు ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయని ప్రముఖ డాక్టర్ సుధీర్ తెలిపారు. గుండె ఆరోగ్యం కోసం చేసే ఏరోబిక్ వ్యాయామాలతో పుష్-అప్స్కు సంబంధం ఉందని, ఇది గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తుందని చెబుతున్నారు. 1,000 మంది పురుషులపై చేసిన JAMA నెట్వర్క్ అధ్యయనంలో 40కి పైగా పుష్-అప్స్ చేయలేనివారితో పోల్చితే చేసిన వారికి గుండెపోటు ప్రమాదం 96% తక్కువ అని తేలింది.
News October 22, 2025
7,565 పోస్టులు.. గడువు పొడిగింపు

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తు గడువును SSC ఈ నెల 31 వరకు పొడిగించింది. 18-25 ఏళ్ల వయస్కులు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. DEC/JANలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్సైట్: https://ssc.gov.in/