News September 13, 2025
టాలీవుడ్ సంచలనం.. తేజా సజ్జ

కలిసుందాం రా, ఇంద్ర, ఠాగూర్, గంగోత్రి తదితర సినిమాల్లో బాలనటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన తేజా సజ్జ వరుస హిట్లతో అదరగొడుతున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్, తాజాగా ‘మిరాయ్’ మూవీతో సూపర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా దైవభక్తికి సంబంధించిన హనుమాన్, మిరాయ్ అతడికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నారు. తేజకు మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Similar News
News February 8, 2026
పన్నులు కట్టినంత మాత్రాన యజమానులు కారు: HC

AP: ప్రభుత్వ భూమిలో చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ఎంతకాలం నివసించినా వారు ఆక్రమణదారులేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా నివాసం ఉండి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ వారికి యాజమాన్య హక్కులు రావని తేల్చి చెప్పింది. ఓనర్‌షిప్ డాక్యుమెంట్స్ ఉన్నవారికే 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం వర్తిస్తుందని పేర్కొంది. విజయవాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి భూసేకరణ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News February 8, 2026
జీడిమామిడిలో ‘టి దోమ’ను ఎలా నివారించాలి?

చెట్లు చిగురించినప్పుడు తొలిసారి లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ఎసిటామాప్రిడ్ 0.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. 2,3 వారాల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. వీటికి వేపనూనెను తగిన మోతాదులో కలిపితే మంచిది.
News February 8, 2026
ఉదయమా? సాయంత్రమా? ఎక్సర్‌సైజ్‌కు బెస్ట్ టైమ్ ఏది?

ఎక్సర్‌సైజ్ ఏ టైమ్‌లో చేసినా మంచిదే. కానీ చేసే సమయాన్ని బట్టి ఫలితాల్లో మార్పు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. సాయంత్రం 4-8 గంటల మధ్య కండరాల సామర్థ్యం పీక్‌లో ఉండి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కు వీలవుతుంది. స్త్రీలు ఉదయం పూట వర్కవుట్ చేస్తే పొట్ట కొవ్వు, BP తగ్గుతాయి. అదే పురుషులకు సాయంత్రం వేళ వ్యాయామం వల్ల BP కంట్రోల్‌లో ఉంటుంది. అయితే రోజూ ఒకే సమయంలో ఎక్సర్‌సైజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.


