News April 14, 2024

కుమార్తెను తలచుకుని టాలీవుడ్ సింగర్ ఎమోషనల్

image

తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ సింగర్ చిత్ర ఎమోషనల్ అయ్యారు. ‘నువ్వు నాతో భౌతికంగా లేకపోయినా.. ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు. నా చివరి శ్వాస వరకూ నాతోనే ఉంటావు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా విజయ్ శంకర్ అనే వ్యక్తిని చిత్ర వివాహం చేసుకున్నారు. వీరికి 2002లో నందన అనే అమ్మాయి జన్మించింది. కానీ తొమ్మిదేళ్ల వయసులో నందన స్విమ్మింగ్‌పూల్‌లో పడి మరణించింది. ఆ సమయంలో చిత్ర దుబాయ్‌లో ఉన్నారు.

Similar News

News March 16, 2026

ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

image

AP: ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఏప్రిల్-మేలో గరిష్ఠ డిమాండ్ 280MUలుగా అంచనా వేయగా ఈ నెలలోనే 274MUలకు చేరింది. ఇందుకు తగ్గట్లుగానే ఏపీ జెన్‌కో <<19368040>>భారీగా<<>> విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. విజయవాడ VTPS, కడప RTPP, కృష్ణపట్నంలో దాదాపు 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. కాబట్టి కరెంట్ ఉత్పత్తికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు <<19384107>>చెబుతున్నారు<<>>.

News March 16, 2026

ఆస్కార్ అవార్డులు.. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ హవా

image

*ఉత్తమ సహాయ నటుడు- షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*కాస్టింగ్ – కస్సాండ్రా (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే)- పౌల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే)- ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
*లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్(2 చిత్రాలకు)- ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సలైవా

News March 16, 2026

స్కూళ్లు, అంగన్‌వాడీలు నేటి నుంచి ఒంటిపూటే

image

AP, TGలో ఇవాళ్టి నుంచి స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. APలో ఉ.7.45 గంటలకు, TGలో ఉ.8 గంటలకు ప్రారంభమై మ.12.30 గంటలకు ముగుస్తాయి. ఇక అంగన్‌వాడీలనూ నేటి నుంచే ఒంటిపూట నిర్వహించాలని AP శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. పాఠశాలల మాదిరే ఏప్రిల్ 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంటాయని, చిన్నారుల పేరెంట్స్ గమనించాలని సూచించింది.