News December 18, 2024
టామ్ క్రూజ్‌కు US నేవీ అత్యున్నత పౌర పురస్కారం

హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. US నేవీ ఆయనను అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. టాప్ గన్, బార్న్ ఆన్ ది ఫోర్త్ ఆఫ్ జులై, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాల్లో తన పాత్రల ద్వారా ఆయన నేవీ సిబ్బంది చేసే త్యాగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారని, నేవీపై ప్రశంసలు పెరిగేలా చేశారని అధికారులు పేర్కొన్నారు. లండన్‌లోని లాంగ్‌క్రాస్ ఫిల్మ్ స్టూడియోలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
Similar News
News January 6, 2026
మేడారం జాతర: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

TG: మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ ఆఫీసర్లను సెక్టోరల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా ఈ నెల 24న ములుగు కలెక్టర్‌కు రిపోర్ట్ చేసి, ఫిబ్రవరి 2 వరకు విధుల్లో ఉండాలి.
News January 6, 2026
తగ్గనున్న చమురు ధరలు.. సామాన్యుడికి భారీ ఊరట!

ముడిచమురు ధరలు తగ్గుతాయని, ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చే అవకాశం ఉందని SBI రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. 2026 జూన్ నాటికి బ్యారెల్ ధర $50కు పడిపోవచ్చని తెలిపింది. దీనివల్ల ఇంధన ధరలు తగ్గి FY27లో ద్రవ్యోల్బణం 3.4% కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇదే జరిగితే GDP వృద్ధి కూడా పెరుగుతుంది. రూపాయి బలపడి ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ఠం అయ్యే అవకాశం ఉంది.
News January 6, 2026
నేను పార్టీ లైన్ దాటలేదు: శశి థరూర్

తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటలేదని MP శశి థరూర్ స్పష్టం చేశారు. అద్వానీకి విషెస్ చెప్పడం మన సంస్కృతి అని, మోదీని తాను ఎక్కడా పొగడలేదని వివరించారు. 17ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, విభేదాలకు తావులేదని చెప్పారు. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యాక్టివ్‌గా ఉండి UDFను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. BJPకి ఆయన దగ్గరవుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ క్లారిటీ ఇచ్చారు.


