News October 8, 2024
ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో రాయితీపై టమాటా, ఉల్లి

AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.
Similar News
News October 30, 2025
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలతో అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.
News October 30, 2025
ఐఐఐటీ బెంగళూరులో ఉద్యోగాలు

ఐఐఐటీ బెంగళూరు 5 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Sr రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, సాఫ్ట్వేర్ డెవలపర్, రీసెర్చ్ ఇంటర్న్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును srinivas.vivek@iiib.ac.in మెయిల్‌కు పంపాలి. వెబ్సైట్: https://iiitb.ac.in
News October 30, 2025
వర్షాలు – 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(1/2)

పత్తి పూత, కాయ ఏర్పడి, వృద్ది చెందే దశలో ఉంటే ముందుగా పొలంలో మురుగు నీటిని బయటకు తొలగించాలి. పంటలో చాళ్లను ఏర్పాటు చేసి మొక్కల్లో గాలి, కాంతి ప్రసరణ పెంచాలి. 2% యూరియా లేదా 2%పొటాషియం నైట్రేట్ లేదా 2% 19:19:19+ 1% మెగ్నీషియం సల్ఫేట్‌తో పాటు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5గ్రా. బోరాక్స్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.


