News September 15, 2025
రూ.5కే కిలో టమాటా

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?
Similar News
News September 15, 2025
రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

TG: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్‌కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.
News September 15, 2025
ఈ జపనీస్ టెక్నిక్‌తో హెల్తీ స్కిన్

జపనీయులు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు 4-2-4 టెక్నిక్ యూజ్ చేస్తారు. ముందుగా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని 4నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్‌తో 2నిమిషాలు సున్నితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివర్లో 2 నిమిషాలు వేడినీటితో, మరో 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పద్ధతి వల్ల చర్మానికి డీప్ క్లెన్సింగ్ అవుతుంది. రక్తప్రసరణ పెరిగి చర్మం బిగుతుగా మారుతుంది.
News September 15, 2025
పీసీఓఎస్‌తో తగ్గుతున్న ప్రతిస్పందన వేగం

ప్రస్తుతం చాలామంది మహిళలు PCOSతో బాధపడుతున్నారు. వీరిలో షుగర్, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. అయితే PCOS బాధితుల్లో ప్రతిస్పందన వేగం తగ్గుతున్నట్లు IITబాంబే నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఏకాగ్రత తగ్గడం, నెమ్మదిగా స్పందించడం PCOS బాధితుల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇన్సులిన్ హెచ్చుతగ్గులతో మెదడు కణజాలం ప్రభావితమై కాగ్నిటివ్ హెల్త్ దెబ్బతింటున్నట్లు తెలిపారు.