News August 30, 2025
టమాటలో తలమాడు తెగులు – నివారణ

తామర పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది. చిగురాకుల పైన ఈనెలు గోధుమ రంగులో మారి, ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్కల లేత కాండంపైనా గోధుమ చారలు కనిపించి మొక్క పూత, పిందె పట్టక ఎండిపోతుంది. నివారణకు తెగులు సోకిన మొక్కలను తొలగించి డైమిథోయేట్ 2mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో మడికి 250 గ్రా., నాటిన 10వ రోజు ఎకరాకు 10kgల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు వేసి పంటను రక్షించవచ్చు.
Similar News
News January 27, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News January 27, 2026
మోహన్ బాబుకు బెంగాల్ ఎక్సలెన్స్ అవార్డు

డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ చేతుల మీదుగా అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు అందజేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అమితాబ్-దీపిక నటించిన ‘పీకు(piku)’ డైరెక్టర్ షూజిత్ సిర్కార్ సైతం ఈ పురస్కారం అందుకున్నారు.
News January 27, 2026
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు

US-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అత్యంత శక్తిమంతమైన ‘అబ్రహం లింకన్’ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను మిడిల్ ఈస్ట్ జలాల్లో మోహరించింది. దీంతో పాటు అత్యాధునిక క్షిపణి విధ్వంసక నౌకలు చేరాయి. US అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైనా వైమానిక దాడులకు ఆదేశాలు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు విదేశీ బలగాల మోహరింపును ఇరాన్ వ్యతిరేకిస్తోంది.


