News July 17, 2024

మళ్లీ పెరిగిన టమాటా ధరలు

image

టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల కిందట రూ.100కు చేరిన కేజీ టమాటా.. ఇటీవల కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లలో కేజీ టమాటా రూ.50-60కి లభించింది. ఇప్పుడు మరోసారి రూ.80(గ్రేడ్-ఏ)కి చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మరి మీ ప్రాంతంలో టమాటా రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి.

Similar News

News November 19, 2025

ఒక్క రోజులో రూ.6వేలు పెరిగిన సిల్వర్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఒకే రోజులో రెండు సార్లు భారీగా పెరిగాయి. ఇవాళ ఉదయం కేజీ సిల్వర్ రేటు రూ.3వేలు పెరగ్గా తాజాగా మరో రూ.3వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,76,000కు చేరింది. అటు బంగారం ధరల్లో సాయంత్రం ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,24,860, 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,450గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 19, 2025

రూ.1.25కోట్ల ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి.. కానీ!

image

యువత, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని రాజకీయ ఉద్ధండులు పిలుపునివ్వడం చూస్తుంటాం. అలా ప్రజాశ్రేయస్సు కోసం ఏకంగా రూ.1.25కోట్ల ఉద్యోగాన్ని వదిలొచ్చి పోటీ చేసి ఓడిపోయాడో యువకుడు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం కోల్‌కత్తాలో చదివి జర్మనీలో ఉద్యోగం చేస్తోన్న శశాంత్ శేఖర్ కాంగ్రెస్ తరఫున బిహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. పట్నా సాహిబ్‌లో బీజేపీ అభ్యర్థి రత్నేష్ కుమార్‌ చేతిలో ఆయన 38,900 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

News November 19, 2025

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం

image

AP: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. కడప(D) పెండ్లిమర్రి సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. తానూ రైతు బిడ్డనే అని, నాన్నకు వ్యవసాయంలో సాయం చేసేవాడినని వెల్లడించారు. అన్నదాతల కష్టాలు తెలుసు కాబట్టే అన్నదాత సుఖీభవ కింద రూ.14వేలు అందజేశామని పేర్కొన్నారు. సాగు తీరు మారి, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పంచసూత్రాలను అమలు చేస్తున్నామన్నారు.