News August 20, 2024
టమాటా రేటు డౌన్.. పారబోసి రైతుల నిరసన

AP: బహిరంగ మార్కెట్లో టమాటా KG ₹20-25 వరకు ఉన్నా రైతులకు నిరాశే ఎదురవుతోంది. అనంతపురంలోని కక్కలపల్లి మండీలో నాణ్యత పేరుతో వ్యాపారులు చాలా వరకు పంటను కొనడం లేదు. 15 KGల బాక్సుకు రూ.100-200 మధ్యే రేటు కేటాయిస్తున్నారు. దీంతో రైతులు పంటను రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి చిత్తూరు తర్వాత అనంతపురంలో అత్యధికంగా 55 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు.
Similar News
News November 1, 2025
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వానలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి ఉండటంతో పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 1, 2025
కొరియన్ల బ్యూటీ సీక్రెట్ ఇదే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. అయితే కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్‌తో నిండి ఉన్న ఆహారాలు, తగిన నిద్ర, నీరు, సన్ స్క్రీన్ వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
News November 1, 2025
రేట్లు సవరించినా గణనీయంగా GST వృద్ధి

TG: OCTలో రాష్ట్రం ₹5,726 కోట్ల GST ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఇది ₹5,211 కోట్లు మాత్రమే. అప్పటితో పోలిస్తే 10% వసూళ్లు పెరిగాయి. GST స్లాబ్‌లను తగ్గించి రేట్లను హేతుబద్ధీకరించినా ఈసారి వృద్ధి సాధించగలిగింది. పండుగ సీజన్లు రాబడి పెరగడానికి దోహదపడ్డాయి. SEPలో వివిధ కారణాల వల్ల రాష్ట్రం GST ఆదాయాన్ని భారీగా కోల్పోయింది. ఆనెలలో GST ఆదాయం మైనస్ 5%తో ₹4,998 కోట్లు మాత్రమే వచ్చింది.


