News February 23, 2025
రేపు ఉ.10 గంటలకు..

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.
Similar News
News December 28, 2025
90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.
News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – లక్షణాలు

మిరపసాగులో ఆకుముడత తెగులు గతంలో తామర పురుగులు, పేను, దోమ వలన వచ్చేది. నేడు వీటితో పాటు జెమినీ వైరస్, మొజాయిక్ వైరస్‌లు కూడా ఈ ముడత తెగులు పురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, లేత పసుపు రంగుకు మారతాయి. ఆకులు పైకి ముడుచుకొని, రెమ్మలు గిడసబారుతాయి. మొక్కలు బలహీనపడి, పూత, పిందె సరిగా కట్టవు. దీనివల్ల పంట పెరుగుదలకు నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గుతుంది.
News December 28, 2025
భారీ జీతంతో ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

<


