News December 8, 2024
రేపు చలో అసెంబ్లీ: సర్పంచుల JAC

TG: పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో రేపు అసెంబ్లీని ముట్టడించనున్నట్లు సర్పంచుల జేఏసీ ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా అసెంబ్లీని ముట్టడిస్తారని జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ హెచ్చరించారు. శాసనసభ సమావేశాల్లో పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News November 17, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
* వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళనకు దిగారు. మెటీరియల్ సరఫరా చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను తమపై మోపడం సరికాదన్నారు.
News November 17, 2025
చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.


