News February 13, 2025

రేపు బంద్.. స్కూళ్లకు సెలవు ఉందా?

image

రేపు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్‌కు మద్దతివ్వడంపై విద్యార్థి సంఘాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంపై నిర్ణయం ప్రకటించనున్నాయి. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

Similar News

News November 21, 2025

కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్‌మెన్‌గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News November 21, 2025

7337359375 నంబర్‌కు HI అని పంపితే..

image

AP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. ‘తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదుచేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది’ అని చెప్పారు.

News November 21, 2025

750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.