News October 16, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు సెలవు ఉండనుంది. పలు జిల్లాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 27, 2026

పుస్తకాలే లోకమైన అక్షర తపస్వికి దక్కిన గౌరవం!

image

పుస్తకాలపై మక్కువతో తన ఆస్తినే అమ్ముకున్న కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బస్ కండక్టర్‌గా పనిచేస్తూనే 20 లక్షల పుస్తకాలతో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో 5 లక్షల విదేశీ పుస్తకాలు, 5 వేల నిఘంటువులు ఉన్నాయి. ఒక సామాన్యుడి పట్టుదల ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని పొందేలా చేసింది. ఆయన కృషి నేటి తరానికి ఎంతో స్ఫూర్తి.

News January 27, 2026

సీరియల్ నటి భర్తపై కత్తితో దాడి!

image

కన్నడ సీరియల్ నటి కావ్య గౌడ భర్త సోమశేఖర్‌ కత్తి గాయాలతో ఆస్పత్రిలో చేరారు. తమ కుటుంబసభ్యులే ఈ దాడికి పాల్పడినట్లు నటి ఆరోపించారు. కావ్య గౌడ సోదరి భవ్య గౌడ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో సోమశేఖర్‌పై సోదరుడు, బంధువులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ‘అక్కమొగుడు’ సీరియల్‌తో ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.

News January 27, 2026

అఫ్గాన్‌లో వర్ణ వ్యవస్థ.. 4 తరగతులుగా ప్రజల విభజన!

image

తాలిబన్ల పాలనలోని అఫ్గాన్‌లో కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వివాదాస్పదమైంది. ప్రజలను 4 తరగతులుగా విభజించడమే ఇందుకు కారణం. ఈ వర్ణ వ్యవస్థలో స్కాలర్లు(ముల్లాలు), ఎలైట్(పాలకులు), మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఉంటారు. ముల్లాలు తప్పు చేసినా శిక్షలుండవు. ఎలైట్ వ్యక్తులకు నోటీసు, సూచన ఇస్తారు. మిడిల్ క్లాస్‌కు జైలుశిక్ష, లోయర్ క్లాస్‌కు జైలుతోపాటు శారీరక శిక్ష విధిస్తారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.