News September 5, 2024
రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

AP: ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News November 7, 2025
బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచండి: వరంగల్ మేయర్

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డిన, ఎంహెచ్ఓ డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
దేవసేన, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: FATHI

TG: ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, సీఎం కార్యాలయ అధికారులపై తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ‘FATHI’ అధ్యక్షుడు రమేశ్ Dy.CM భట్టితో చర్చల సందర్భంగా తెలిపారు. తమ కామెంట్స్ను వక్రీకరించారన్నారు. దీన్ని ఖండిస్తూ ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇక సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను వర్సిటీ అధికారులతో మాట్లాడి నిర్వహిస్తామని వెల్లడించారు.
News November 7, 2025
మరోసారి ‘నో హ్యాండ్ షేక్’!

భారత్, పాక్ క్రికెటర్ల మధ్య ‘నో హ్యాండ్ షేక్’ వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్లో, మహిళల ప్రపంచ కప్లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇవాళ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలోనూ ఇది రిపీట్ అయింది. ఇండియా మ్యాచ్ <<18225529>>గెలిచిన <<>>కొన్నిక్షణాలకే ప్రసారం ముగిసింది. ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. రెండు టీమ్స్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే ఉండిపోయాయని సమాచారం.


